పేదవారికి అండగా వుండడానికి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తూన్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాని నిర్వహిస్తూన్నామన ఆయన తెలిపారు. ఆగస్టు 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య మహూర్తం నిర్ణయించామని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలలో వివాహ జంటలు రిజిష్ర్టేషన్ చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలలో సీఎంలు ముందుకు వస్తే, ఆ ప్రాంతాలలో కూడా టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
2007 పిభ్రవరి 22వ తేదిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. 6వ విడతలలో కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహణ ద్వారా 45 వేల జంటలు ఒక్కటయ్యాయి. 2011 మే 20వ తేదిన కళ్యాణమస్తు చివరి విడత నిర్వహించిన టీటీడీ.. ఆర్దిక భారం, ఇతర మతస్థులు, నకీలి జంటలు కళ్యాణమస్తు కార్యక్రమంలో అందజేసే బంగారు తాళిబోట్టులు కోసం వివాహం చేసుకుంటున్నారని విజిలేన్స్ రిపోర్ట్‌లో తేలింది. అయితే.. విజిలేన్స్ రిపోర్ట్ మేరకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని అప్పటి ఈవో ఐవైయ్యార్ కృష్ణారావు నిలిపివేశారు.
కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని 2013లో అప్పటి చైర్మన్ బాపిరాజు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో తాజాగా.. సీఎం జగన్ ఆదేశాలు మేరకు ఎట్టకేలకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. రెండు సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కోవిడ్ కారణంగా వాయిదా పడుతు వస్తూన్న కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ఆగస్టు 7వ తేదీన నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ.