ప్రపంచ పర్యావరణ సంరక్షణలో భాగంగా కరకంబాడి రోడ్డులో పదివేల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని చెట్టు నాటారు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన. అనంతరం జవహార్ రెడ్డి మాట్లాడుతూ… అంజనాద్రే హనుమంతుడి జన్మస్దలం. అన్ని వివాదాలు సర్దుకుంటాయి. టీటీడీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాము. గోవిందానంద సరస్వతి వచ్చి చూపించిన సరైనా ఆదారాలు లేవు. ఇప్పటికి అంజనాద్రే హనుమంతుని జన్మస్దలం. దీనికి కంటే బలమైన ఆధారాలు ఎవరైనా చూపిస్తే అప్పుడు పునరాలోచన చేస్తాం… అప్పటి వరకు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రే అని స్పష్టం చేసారు.