అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్‌చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అడ్డగోలుగా లిస్ట్ తయారు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేశారన్నారు.
ఏపీ ఛీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డితో స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియషన్ సభ్యుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులపై చర్చ జరిగింది. పెండింగ్ నిధులు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్షీశా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.