Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. దర్శనం టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. ఆర్జిత సేవ, కల్యాణోత్సవం, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, డార్మిటరీ రూమ్ బుకింగ్ టిక్కెట్లను ఈరోజు ప్రకటించారు.