ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా త్రిపురనేని జయంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవి త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. త్రిపురనేని కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. విశాల భావాలతో రామస్వామి నాటి సమాజం పై చెరగని ముద్ర వేశారు. సంఘసంస్కరణ కర్తగా సమాజంలో మార్పును ఆకాంక్షించారు రామస్వామి చౌదరి. తన కలంతో ఎంతోమందిని కదిలించేలా చేశారు.ఇతరులను ప్రశ్నించటం సులభం. కాని తనను తాను ప్రశ్నించుకుని తగిన సమాధానం చెప్పి ఒప్పించటం చాలా కష్టం. అటువంటి కష్టమైన పనిని దాటవేయకుండా తాను అనుసరిస్తూవచ్చిన ప్రతి అంశాన్నీ తనదైన పంథాలో సమర్థించుకుంటూ రామస్వామి ముందుకు వెళ్లారు.
Read Also: మూడో రోజు రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్.. బస్సులు సీజ్..
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
తమిళనాడులోని రామస్వామి నాయకర్ తరహాలో ఆంధ్రలో ఈ రామస్వామి చౌదరి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని నడిపించాడు. మత మౌడ్యాలకు స్వస్తిచెప్పి మానవతకు పట్టం కట్టాలన్నది రామస్వామి సిద్ధాంతం. చదువుకుంటూనే రామస్వామి రాసిన రాణా ప్రతాప్ నాటకాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. పెళ్లి మంత్రాలను సంస్కృత మంత్రాలతో నిర్వహించడం వలన సమాజం లో ఏ కొద్ది మందిలో మాత్రమే ఈ తంతు నిర్వహిస్తున్నారని ఈ విధానాన్ని మార్చాలని రామస్వామి పోరాడారు. సూత పురాణం, కుప్పుస్వామి శతకం, భగద్గీత తదితర రచనలు చేశారు రామస్వామి.
తాజావార్తలు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!