భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన
భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే రెండు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై 8వ తేదీ నుంచి వాహన రద్దీ.. మంత్రి కీలక సూచనలు
హైదరాబాద్ – విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుందన్నారు. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాను రేపు తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తామన్నారు.. మెయిన్‌గా ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుందని తెలిపారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు.. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దని మంత్రి సూచించారు.
కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన బండ్ల గణేష్.. ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ గా నామకరణం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘బండ్ల గణేష్’. అప్పుడు వివిధ కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండే ఆయన విజయవంతమైన నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశారని చెప్పవచ్చు. అయితే తాజాగా బండ్ల గణేష్ మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇదివరకు ‘అంజనేయులు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా తెరెకెక్కిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ ప్రొడక్షన్స్’ బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చింది.
చెంచులకు శుభవార్త.. ఉచితంగా మల్లన్న స్పర్శ దర్శనం..
చెంచులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం.. శ్రీశైలంలో చెంచులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కలిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. చెంచు గిరిజనలకు ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభించారు శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు.. శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు 100 మంది చెంచు గిరిజనులు.. ఇక, ఇప్పటి నుండి ప్రతి నెలలో ఒకరోజు చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు దేవస్థానం అధికారులు చెబుతున్నారు.. గత ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో చెంచు గిరిజనులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీశైలం ఆలయం చైర్మన్, సభ్యులు.. ఈ నిర్ణయానికి అనుగుణంగా.. ఇవాళ్టి నుంచి చెంచులకు ఉచితంగా మల్లన్న స్పర్శ దర్శనాన్ని కలిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..
తీవ్ర ఆవేదన చెందా.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోడీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. రష్యా రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. శాంతి ఒప్పందాన్ని అడ్డుకునేందుకు రష్యా అబద్ధాలు చెబుతోందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. పుతిన్ నివాసంపై దాడిని ప్రధాని మోడీ ఖండించారు. డ్రోన్ దాడుల వార్తలు తెలియగానే ‘తీవ్ర ఆందోళన’ చెందినట్లుగా తెలిపారు. ప్రపంచ నాయకులు సంయమనం పాటించాలని.. శాంతి కోసం దౌత్య ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని కోరారు.
‘బ్యాటల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్యాటిల్ ఆఫ్ గల్వాన్” సినిమాపై చైనా మీడియా తీవ్రంగా స్పందించింది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌పై గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పలు ఆరోపణలు చేసింది. చైనా పత్రికలు ఈ సినిమాను సైద్ధాంతిక విషం నింపుతున్న జాతీయవాద మెలోడ్రామాగా పేర్కొంది. డ్రాగన్ కంట్రీ ప్రకారం, సినిమా కథనం 2020లో గల్వాన్ లో జరిగిన సంఘటనలను దృష్టితో కాకుండా, భారత బలగాలే చైనా భూభాగంలోకి చొరబడ్డారని, చర్చల సమయంలో హింసాత్మక దాడులు చేసినట్టు బీజింగ్ ఆరోపణలు చేస్తుంది.
దుర్గమ్మ భక్తులకు అలర్ట్… ఇంద్రకీలాద్రిపై కీలక మార్పులు..
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు కీలక సంస్కరణలను అమలు చేశారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయం ఆదా, పారదర్శకత, దుర్వినియోగ నియంత్రణ లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై రూ.500 అంతరాలయ దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డును.. దర్శనానికి వెళ్లే ముందు, టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. అంటే, దర్శనం పూర్తయ్యాక ప్రసాదం కోసం వేరే కౌంటర్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తుడికి లడ్డు చేతికి అందజేసే విధానంను ఆలయ బోర్డు అమల్లోకి తీసుకొచ్చింది.
2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.! : యూఎస్ రిపోర్ట్..
భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది. ఇది అమెరికన్ ప్రయోజనాలపై పరిమిత ప్రభావం చూపొచ్చని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుద కారణంగా భారత్, పాక్ మధ్య తిరిగి సాయుధ సంఘర్షణకు అవకాశం ఉన్నట్లు సీఎఫ్ఆర్ తన కాన్‌ఫ్లిక్ట్ వాచ్ ఇన్ 2026 నివేదికలో పేర్కొంది. భారత్‌తో మాత్రమే కాకుండా, పాక్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా సాయుధ ఘర్షణ జరిగే అవికాశం ఉందని నివేదిక తెలిపింది.
శృతిమించుతున్న ఇసుక మాఫియా ఆగడాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ పథకం కొందరికి వరంగా మారితే, పామర్రు నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే గనిగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి, నది గర్భాన్ని ఛిద్రం చేస్తూ ఇసుక మాఫియా సాగిస్తున్న దందా ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పామర్రు నియోజకవర్గ పరిధిలోని రొయ్యూరు, లంకపల్లి, తోట్లవల్లూరు ఇసుక రీచ్‌లు ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అధికార పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒక సిండికేట్‌గా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. పేరుకు అనుమతులు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం మైనింగ్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. మైనింగ్ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయాల్లోనే తవ్వకాలు జరపాలి. కానీ ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వేళల్లో వందల సంఖ్యలో టిప్పర్లు ఇసుకను తరలిస్తున్నాయి. తోట్లవల్లూరు రీచ్‌ను కావాలనే మూసివేసి, రొయ్యూరు, లంకపల్లి రీచ్‌ల ద్వారా దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేయాలని 2023లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ.. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థులు కోరారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పిటిషన్లను కొట్టివేసింది.