* ఇవాళ మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి.. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు
* ఇవాళ్టితో ముగియనున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం.. అక్టోబర్ 31న ప్రారంభమయిన కోటి దీపోత్సవానికి అనూహ్య స్పందన
* నేడు విజయనగరం జిల్లాకు రానున్న డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి..జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం
* లిక్కర్ స్కాం విచారణలో భాగంగా ఇవాళ అభిషేక్ రావు, విజయ్ నయ్యర్ ల బెయిల్ పిటీషన్ పై ఆర్డర్ ఇవ్వనున్న స్పెషల్ కోర్టు
* జీ20 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈరోజు ఇండోనేషియా వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
* మూడవ కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు.
*శ్రీశైలం కార్తీకపౌర్ణమి 3వ సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తులు
*కార్తీక సోమవారం సందర్బంగా భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తీ, కపిలతీర్దం సహా ఇతర శైవాలయాలు
*కార్తీక మాసం మూడవ సోమవారం పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అర్థరాత్రి నుండి ప్రారంభమైన వ్రతాలు, దర్శనాలు.
*విశాఖలో నేడు టీటీడీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో కార్తీక మహా దీపోత్సవం….శోభా యాత్ర,దీపోత్సవం లో మూడు వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం
*విశాఖలో VMRDA చిల్డ్రన్ ఏరీనాలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు…బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న మంత్రి అమర్నాథ్
*నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ .. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయమని సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనంతబాబు
*కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
*భీమవరంలోని పంచరామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.