Today Events February 25, 2023
* అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం NAOB నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారం కోసం 117వ రోజుకు చేరిన మత్స్యకారుల ఆందోళన….నిర్ధిష్టమైన హామీలతో పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు
*విశాఖ: నేడు వైజాగ్ పోర్టు ట్రస్ట్ ను సందర్శించనున్న కేంద్ర కార్యదర్శి….మేజర్ పోర్ట్స్ ప్రయివేటీకరణ సహా కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం సీ హార్స్ జంక్షన్ దగ్గర ధర్నా నిర్వహించనున్న సీఐటీయూ…
*నేటి నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ
*భీమవరంలో జనసేన పిఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పర్యటన రద్దు
*కర్నూలు నేటి నుంచి రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..అప్పర్ భద్ర ప్రాజెక్టు నిలిపివేయాలని, సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర
*నంద్యాల నేడు శ్రీశైలానికి రానున్న సుప్రీంకోర్టు CJI ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్..హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి శ్రీశైలం చేరుకోనున్న CJI
*విశాఖనగరంలో ప్రయివేట్ స్కూళ్ళపై స్పెషల్ డ్రైవ్…ఎటువంటి అనుమతులు పొందకుండా ప్లే స్కూళ్ళు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన విద్యాశాఖ
*నేడు గుంటూరులో పర్యటించనున్న కేంద్రమంత్రి భారతి పవర్. నేడు హిందూ ఫార్మసీ కళాశాలలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి భారతి పవర్
*నేడు తొలి సారి సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్న వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి
*తాడిపత్రిలో సచివాలయ కన్వీనర్లు ,గృహ సారథుల సమావేశం.పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
*బాపట్ల జిల్లా చుండూరు మండలం తురుమెళ్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
*నేటి నుండి రెండు రోజులు పాటు రాజమండ్రిలో బాలోత్సవం… రాజమండ్రి ఎస్.కె.వి.టి. కళాశాలలో అకాడమిక్ కల్చరల్ విభాగాల్లో 60 పోటీల నిర్వహణకు వేదికలు ఏర్పాటు
*తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల.. మార్చి,ఏఫ్రిల్,మే మాసంకు సంబంధించిన టిక్కెట్ల కోటాను విడుదల చెయ్యనున్న టీటీడీ..రోజుకి 500 చొప్పున విడుదల చెయ్యనున్న టీటీడీ
*ఇవాళ రాజమండ్రి రానున్న కేంద్రమంత్రి, ఏపీ బీజీపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్.. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సాయంత్రం వరకు పార్టీ శ్రేణులతో ఏపీ ఇన్ ఛార్జ్ మురళీధరన్ సమావేశాలు.. పాల్గొననున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు