ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,341 సాంపిల్స్ పరీక్షించగా.. 1,746 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 20 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,648 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,58,275 కి చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,615 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,766 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. నేటి వరకు 2,55,26,861 సాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.