Tirupati Tragedy: టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారి రమ్య అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. కన్న తల్లే ఆ చిన్నారిని హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు (సెప్టెంబర్ 6న) ఉదయం, నగరంలోని కొరమేనుగుంట దేవుని కాలనీలో 6 నెలల పసికందు రమ్యను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తండ్రి తిరుపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల కంప్లైంట్ తో రంగంలోకి దిగిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు.
Read Also: Viral: ఆ మొక్కలో అంత పవరుందా… ఏంటా మొక్క.. ఏంటా పవర్…
అయితే, ఒకవైపు పోలీసులు గాలింపు నిర్వహిస్తున్న సమయంలో, ఇంటి సమీపంలోని మురికి కాలువలో చిన్నారి రమ్య పడి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇక, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండటంతో, మూడో కుమార్తెగా రమ్య పుట్టిన తర్వాత తల్లి ఈ దారుణ ఘటనకు పాల్పడినట్టు ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని.. ఈ హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.