Tirupati Ruia Hospital: రుయాలో అమానవీయఘటన… అంబులెన్స్ దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్ డ్రైవర్లను అడగ్గా.. రూ.10వేలు అవుతుందని చెప్పారు.
అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.ఈ క్రమంలో ఆ అంబులెన్స్ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్ డ్రైవర్లు కొట్టి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గానీ.. పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అనంతరం రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తిరుపతి రుయా ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ స్పందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని వివరణ కోరారు. ఈ ఘటన దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మృతదేహాల విషయంలో వ్యాపారం చేస్తారా… దోషులను కఠినంగా శిక్షిస్తాం. మృతుడి కుటుంబ సభ్యులను ప్రైవేటు వ్యక్తులు బెదిరించారా..? ఆసుపత్రి సిబ్బందే బెదిరింపులకు పాల్పడ్డారన్న కోణంలో విచారణ చేపట్టాలని ఆదేశించాం.
Read Also: Green india Challenge: ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ ప్రారంభం
విచారణలో ఎవరి తప్పు ఉన్నా వదిలిపెట్టం. కఠినంగా చర్యలు తీసుకుంటాం. మహాప్రస్థానం అంబులెన్సులు 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకొస్తాం. ప్రీపెయిడ్ ట్యాక్సీల విషయాన్ని పరిశీలిస్తాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలను వీలైనంతవరకు మహాప్రస్థానం వాహనాల ద్వారానే ఉచితంగా తరలించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మృతుల కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తాం. అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించాం అన్నారు మంత్రి విడదల రజినీ.
తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి కుమారుడి మృత దేహాన్ని తండ్రి తన బైక్ పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్ పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమే. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్ లో దుస్థితిని అద్దం పడుతుందని ట్వీట్ చేశారు చంద్రబాబు.
My heart aches for innocent little Jesava,who died at Tirupati’s RUIA hospital.His father pleaded with authorities to arrange an ambulance which never came.With mortuary vans lying in utter neglect,pvt ambulance providers asked a fortune to take the child home for final rites.1/2 pic.twitter.com/mcW94zrQUt
— N Chandrababu Naidu (@ncbn) April 26, 2022
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!