ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి…