సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరిస్తుంటే భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. సుమారు 3.45 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి ఈ వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. కేవలం భక్తులే కాకుండా, రికార్డు స్థాయిలో 14,500 వాహనాలు ఈ ఒక్క రోజే తిరుమల కొండకు చేరుకోవడం విశేషం.
T20 world cup: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు.. లిస్ట్ లో ఎవరెవరున్నారంటే?
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాద విభాగం మునుపెన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేసింది. గ్యాలరీల్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా ఆహారం, నీరు అందించింది. ఈ ఏడాది రథసప్తమి రోజున మొత్తం 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలను పంపిణీ చేసి టీటీడీ రికార్డు సృష్టించింది. కేవలం భోజనం మాత్రమే కాకుండా, సుమారు 6.41 లక్షల మందికి కాఫీ, టీ, పాలు , టిఫిన్లను పంపిణీ చేశారు. ఎండ వేడిని తట్టుకునేలా భక్తులకు దాదాపు 4 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేయడం టీటీడీ సేవా నిరతికి నిదర్శనంగా నిలిచింది.
వేలాది మంది శ్రీవారి సేవకులు , టీటీడీ సిబ్బంది సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేశారు. గ్యాలరీల్లో భక్తులకు ఎండ తగలకుండా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, క్యూ లైన్లలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ సరఫరా చేశారు. టీటీడీ ఈఓ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశారు. ఆధ్యాత్మిక ఉత్సవాలతో పాటు భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేసిన ఈ భారీ ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమల చరిత్రలో అత్యంత క్రమశిక్షణతో , వైభవంగా జరిగిన రథసప్తమి వేడుకల్లో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.
KING Nagarjuna : 100 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్
