సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరిస్తుంటే భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. సుమారు 3.45 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి ఈ వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. కేవలం…