Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ
- సోషల్ మీడియా ఫోటోలే హత్యకు కారణం
- ప్రియురాలి విషయంలో పెరిగిన వివాదం
- మద్యం తాగించి కిరాతక హత్య
- చెరువులో మృతదేహం.. పోలీసుల విచారణలో నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లాలోని తవణంపల్లి మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల కారణంగానే ఈ కిరాతక హత్య జరిగినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్‌తో పాటు, అతనికి సహకరించిన ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి!
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
పోలీసుల కథనం ప్రకారం.. మోదలపల్లి గ్రామానికి చెందిన యువరాజ్ అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, అదే గ్రామానికి చెందిన లవకుమార్ అనే మరో యువకుడు సదరు యువతితో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లు , డీపీలుగా పెట్టుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి ఫోటోలు దిగడమే కాకుండా, వాటిని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై యువరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో లవకుమార్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, అతడిని అంతం చేయాలని యువరాజ్ పథకం వేశాడు.
ఈ నెల ఒకటో తేదీన రాత్రి యువరాజ్ తన వద్ద పనిచేసే ఒక మైనర్ బాలుడితో కలిసి లవకుమార్‌ను కొత్త చెరువు వద్దకు పిలిపించాడు. అక్కడ పథకం ప్రకారం లవకుమార్‌కు భారీగా మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేశాడు. లవకుమార్ పూర్తిగా స్పృహ కోల్పోయిన సమయంలో, యువరాజ్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌తో అతని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఎవరికీ దొరకకూడదని, గుర్తుపట్టలేని విధంగా డీకాంపోజ్ కావాలని భావించి సమీపంలోని చెరువులో పడవేశారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తవణంపల్లి పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి కాల్ డేటా , సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా యువరాజ్‌పై అనుమానం కలిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!