Heavy Devotee In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ఏకాదశికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు..
- టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Devotee In Tirumala: కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తిరుమలగిరుకు భక్తులు పొట్టెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 72, 487 మంది భక్తులు దర్శించుకోగా.. 29, 500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.52 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.
Read Also: US: అమెరికాలో ఎయిర్‌లైన్స్ సంక్షోభం.. 1,100 ఫ్లైట్స్ రద్దు.. 4 వేల విమానాలు ఆలస్యం
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
మరోవైపు, 30వ తేదీ నుంచి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 30వ తేదీన స్వర్ణ రథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. 31న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది. 10 రోజులు పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సందర్భంగా పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి మూడు రోజులకు ఆన్ లైన్ విధానంలో ఇప్పటికే టికెట్ల జారీ పూర్తైంది. మిగిలిన ఏడు రోజులకు టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యూ లైనులకు అదనంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డుని క్యూ లైనుగా టీటీడీ మార్చింది. 2400 మంది పోలీసులు,1150 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్‌లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్‌ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!