Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: రాష్ట్ర అప్పులపై తాను ఇంతకు ముందు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడడం కాదు.. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాను ఆత్మగౌరవం కోసం పని చేస్తానని.. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నానన్నారు. రాజకీయాలకు వచ్చింది మీలాగా అడ్డగోలుగా మాట్లాడటం కోసం కాదని మండిపడ్డారు. మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తున్నా.. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. హరీష్, కేటీఆర్, కేసీఆర్‌లు సోమాజిగూడకి రావాలని కోరారు. తాను తప్పు చెప్తె రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మీరేం చేస్తారో చెప్పి సోమాజిగూడకి రావాలని డిమాండ్ చేశారు. పౌరుషం ఎవరికి ఉన్నదో తెలుస్తుందని.. పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా అనేది తెలుస్తుంది కదా..? అని మంత్రి ఫైర్ అయ్యారు.
బావ బామ్మర్దులు తాను పారిపోయిన అని అంటున్నారని.. సిగ్గు శరం అని మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి చెప్పారు. “నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. ఇప్పుడు కూడా పౌరుషం ఉన్నట్టు మాట్లాడి.. అసలు విషయం దాట వేస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అన్నట్టు ఉంది కేటీఆర్, హరీష్ తీరు. అసెంబ్లీలో కేటీఆర్, మేం చేసిన అప్పులు రూ. 3 లక్షల 17 అన్నారు. అదే కేటీఆర్ ఇంకోసారి రూ.3.85 వేల అప్పు అన్నారు. హరీష్ మాట్లాడుతూ
రూ. 4 లక్షల 26 వేల కోట్లు అని ఒకసారి, రూ. 4 లక్షల 17 వేల కోట్లు అప్పు అని ఇంకోసారి చెప్పారు. మీరు చెప్పింది రుజువు చేయండి. నేను చెప్పిన లెక్క తప్పు ఐతే.. నేను రాజీనామా చేస్తా. మీరు చెప్పింది అబద్దం ఐతే జవాబు రాత పూర్వకంగా చెప్పండి. మీరు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన రూ. 8 లక్షల 21 వేల కోట్లుకి కట్టుబడి ఉన్నా. కార్పొరేషన్లకు అప్పు తెచ్చింది ఎవరు? మీరు అప్పు తేకుంటే.. ప్రభుత్వం ఖజానా నుంచి ఎందుకు అప్పులు కట్టారు. కేసీఆర్ ఎలాగో అసెంబ్లీకి రావడం లేదు. పోనీ కేసీఆర్‌ను ఇవాళ మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వమనండి. నేను ఇవాళ కూడా సోమాజిగూడకి రావడానికి సిద్ధం. సమాధానం చెప్పాలి. మీరు రుజువు చేయలేకపోతే ఏం చేస్తారో కూడా చెప్పాలి. పార్టీని రద్దు చేసుకుంటాం అని చెప్పండి. సిగ్గుందా శరం ఉందా అంటున్నారు మిస్టర్ కేటీఆర్. పౌరుషం ఉంది కాబట్టే.. ఆ నాడు రాజీనామా చేశా. ఆనాడు రాజీనామా చేశాకే.. పాలమూరులో బీఆర్ఎస్కి ఏడు సీట్లు వచ్చాయి. నా చరిత్ర తెలుసుకోండి. సిగ్గు తప్పిన మాటలు మీరు మాట్లాడుతున్నారు.” అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ అంశంపై రాసిన ఓ బహిరంగ లేఖను కేటీఆర్‌కి వాట్సాప్ చేశారు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు