Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో రోజురోజుకూ కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. సస్పెండ్ అయిన సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పలు సంచలన అంశాలను వెల్లడించింది. కేసుకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడంతో పాటు, వాటిని ధ్వంసం చేసి ఉండే అవకాశాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు SIT కోర్టుకు తెలిపింది.
దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మరకలను గుర్తించిన SIT, టెర్రస్‌పై లభించిన మరకలున్న లాఠీ, ఎముకల అవశేషాలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసును స్వాధీనం చేసుకుంది. కొందరు సాక్షుల వాంగ్మూలాల ప్రకారం సాయికృష్ణ పోలీసు కస్టడీలోనే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించినట్లు SIT పేర్కొంది. మృతదేహాన్ని ఏం చేశారనే అంశాన్ని తెలుసుకునేందుకు నాగరాజు కస్టడీ అవసరమని కోర్టును కోరింది.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
సీఐ నాగరాజు లేఖ..
మరోవైపు సస్పెండ్ సీఐ నాగరాజు కోర్టుకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తూ తాను నిర్దోషినని, కేసులో తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తనను బెదిరిస్తూ కస్టడీ కోరుతున్నారని, విచారణ అవసరమైతే న్యాయవాది సమక్షంలో నిర్వహించాలని కోర్టును అభ్యర్థించారు.
హార్డ్ డిస్క్‌లు మార్చేశారా..?
ఇదిలా ఉండగా, స్టేషన్‌లోని పాత సీసీటీవీ హార్డ్‌డిస్కులను తొలగించి వాటి స్థానంలో కొత్త హార్డ్‌డిస్కులు అమర్చినట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలినట్లు SIT గుర్తించింది. సీసీటీవీ కాంట్రాక్టర్‌ను విచారించగా, అవి తాము అమర్చిన హార్డ్‌డిస్కులు కావని చెప్పినట్లు సమాచారం. బిల్లులు, ఇన్వాయిస్ల పరిశీలన అనంతరం కొత్త హార్డ్‌డిస్కులు కొనుగోలు చేసి పాతవాటిని మాయం చేసినట్లు SIT అనుమానిస్తోంది. ఈ కేసులో ఆధారాల ధ్వంసం, మృతదేహం అదృశ్యంపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..