Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ttd Statement That There Was No Abuse In Tirumala Temple

TTD: ఎటువంటి అపచారం జరగలేదు.. వదంతులను నమ్మకండి..

Published Date :October 4, 2024 , 5:16 pm
By Sudhakar Ravula
  • తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం..
  • అటువంటి వదంతులు నమ్మవద్దని సూచించిన టీటీడీ..
TTD: ఎటువంటి అపచారం జరగలేదు.. వదంతులను నమ్మకండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది.. అయితే, దీనిపై క్లారిటీ వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయని.. కానీ, శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని సూచించింది టీటీడీ.. సాధారణంగా బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి.. వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని పేర్కొంది.. అయితే, అందులో భాగంగానే భిన్నమైన ద్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం అని కొట్టిపారేశారు.. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని భక్తులకు తెలియజేస్తున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది టీటీడీ..

Read Also: YouTube Shorts : యూట్యూబర్స్‌కి గుడ్‌న్యూస్.. షార్ట్స్‌ నిడివి పెంపు..

కాగా, ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది, ఇది బ్రహ్మోత్సవాలను ప్రారంభించనుంది. రాత్రి నుంచి తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి వివిధ వాహనాల్లో ఊరేగించనున్నాడు. బ్రహ్మోత్సవాలు 12వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేటు వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 4 నుండి 7వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేటు వాహనాలు పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. గరుడ సేవ సందర్భంగా, 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్‌లో ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు. అలాగే, 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12వ తేదీ వరకు కూడా ప్రైవేటు వాహనాలు పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి పొందుతాయని పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను నిలిపివేసినట్లు ప్రకటించిన విషయం విదితమే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Tirumala Brahmotsavam 2024
  • Tirumala temple
  • ttd

తాజావార్తలు

  • Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

  • Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions