Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Devotees Record: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది మొత్తం 2.67 కోట్ల మంది భక్తులు శ్రీవారి దర్శనం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు అంటే 2023-24 సంవత్సరంలో 2.56 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్న సంఖ్య అత్యధికంగా ఉండేది. అయితే, 2025-26లో ఆ సంఖ్యను దాటి, అదనంగా సుమారు 11 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది.
Read Also: Israel-lebanon: అమెరికా మధ్యవర్తిత్వంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ఎప్పుడంటే..!
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
భక్తుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) మానిటరింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. ఈ వ్యవస్థ ద్వారా క్యూ లైన్లను సమర్థంగా పర్యవేక్షించడం, నిర్వహణను మెరుగుపరచడం వల్ల భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించగలిగారు. క్యూ లైన్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేయడం వల్ల రోజుకు అదనంగా 3 నుంచి 4 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించగలిగారు. దీంతో, మొత్తం వార్షిక భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు.. తిరుమలలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, సమర్థవంతమైన నిర్వహణ వల్ల భక్తులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం లభిస్తోంది. భవిష్యత్తులో కూడా భక్తుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, శ్రీవారిపై ఉన్న భక్తి, విశ్వాసానికి నిదర్శనం. ఆధునిక సాంకేతికతతో కలిపిన సమర్థవంతమైన నిర్వహణ వల్ల ఈ రికార్డు సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు