Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తొలి ఏకాదశి, శనివారం ఒకే రోజు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీనితో భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని అధికారులు తెలిపారు.
శుక్రవారం నాడు మొత్తం 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 38,018 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.98 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణిలో మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ముందస్తు చర్యల కోసం పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతో మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో హారతి కార్యక్రమం నిలిపివేయబడుతుంది.
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
తాజావార్తలు
-
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
-
Jeep Meridian: భారత్‌లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్.. ధర ఎంతంటే?
-
Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
-
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్‌కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
-
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!