Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
Huge Rush In Tirumala: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా గత రెండు రోజుల్లోనే భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.