Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Hundi Issue: రూ.1,000 నోట్లతో పాటు.. పాత రూ.500 నోట్లను రద్దు చేసింది ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.2 వేల నోట్లు, కొత్త రూ.500 నోట్లతో పాటు.. రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10.. ఇలా కొత్త కరెన్సీ తీసుకొచ్చింది.. అయితే తిరుమలలోని శ్రీవారికి మాత్రం పాత ఓట్ల పంచాయతీ తప్పడంలేదు.. శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో ఉంటాయి. అయితే, ఇటీవలి కాలంలో హుండీలో పడుతున్న చెల్లని కరెన్సీ నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా డీమోనిటైజేషన్ సమయంలో రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్లను ఇప్పటికీ కొందరు భక్తులు హుండీలో వేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also: Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, టీటీడీ వద్ద ఇప్పటికీ రూ.400 కోట్లకు పైగా రద్దైన నోట్లు నిల్వలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోట్లను మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల, అవి ఉపయోగించలేని స్థితిలోనే ఉన్నాయి. దీంతో టీటీడీకి ఆర్థిక పరంగా నష్టం వాటిల్లుతోంది. ఇదిలా ఉండగా, మరో వైపు ఇటీవల రద్దు చేసిన రూ.2000 నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. ప్రతి నెలా సుమారు రూ.35 లక్షల విలువైన రూ.2000 నోట్లు హుండీలో చేరుతున్నట్లు అంచనా. అయితే ఈ నోట్ల విషయంలో మాత్రం టీటీడీ కొంత ఉపశమనం పొందుతోంది. ఎందుకంటే, ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. భక్తుల విశ్వాసంతో సమర్పించే ఈ కానుకలు దేవుడికి అంకితం అయినప్పటికీ, చెల్లని నోట్ల సమస్య టీటీడీ నిర్వహణకు సవాల్‌గా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!