Vontimitta: కపడ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. రెండవ అయోధ్యగా పేరుగాంచింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీవెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఒక బ్రహోత్సవం జరగనుండగా.. అక్టోబర్‌లో నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి.