టాలీవుడ్ లో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నట వారసులు వచ్చి హీరోలుగా సెటిల్ అయ్యారు కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో నట వారసురాలు మాత్రం అంతగా ఆసరానా దక్కించుకోలేదు. అందుకు నిదర్శనం మెగా డాటర్ నిహారిక కొణిదెల. ”ఒక మనసు” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమాతోనే విమర్శల పాలు అయ్యింది. నటన తనకు సెట్ కాదని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ప్రేక్షకులు వారి అభినయానికే ప్రధాన ఓటు వేస్తారు. దీంతో అమ్మడు రెండు మూడు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమైంది. ఇక నిహారిక తరువాత ప్రస్తుతం అందరి కళ్ళు సితార పైనే ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు. ఘట్టమనేని నటవారసురాలిగా, మహేష్ బాబు గారాల పట్టీ గా ఇప్పటికే సోషల్ మీడియా లో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ను హీరోయిన్ గా తీసుకొస్తారా..?లేక వేరే రంగంలో తీసుకెళ్తారా..? అనేది మహేష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.
ఇక తాజాగా మహేష్ ఇచ్చిన క్లారిటీ తో సీతూ పాప హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తుందన్న విషయం తెలిసిపోతుంది. మహేష్ నటించిన సర్కారువారి పాట” మే 12 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఈ సినిమాలోని పెన్నీ సాంగ్ లో సితార డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్ గురించి అడగగా “అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు. ఇంటికి వెళ్లి నమ్రత కు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు. ఇక సాంగ్ లో సితార డాన్స్ చాలా బాగా చేసింది” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సినిమా ఎండ్ కార్డ్స్ లోనైనా సితార డాన్స్ కనిపిస్తుందా.. అని అడగగా “మేకింగ్ వీడియో లో పెట్టడానికి ప్లాన్ చేశాం. కానీ కుదరలేదు. అప్పటికే ప్రింట్ యూఎస్ వెళ్లిపోయింది. దయచేసి ఇప్పుడు ఇలాంటివేమీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితార అడుగుతుంది. కానీ పర్‌ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది’ అంటూ తెలిపారు మహేష్. ఇక దీంతో త్వరలోనే సితార టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.