Gurazala Mining Issues: పల్నాడులో మార్మోగుతోన్న కేజీఎఫ్ సినిమా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurazala Mining Issues: కొన్ని సినిమా స్టోరీలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అందులో తీసుకున్న సెంటర్ పాయింట్.. అందరినీ కట్టిపడేస్తోంది.. ఇక, కేజీఎఫ్ సినిమా ఎంతో మంది ఆదరణ పొందింది.. రెండో భాగం కూడా వచ్చింది.. మూడో భాగం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, పల్నాడు జిల్లాలో కేజీఎఫ్ సినిమా పేరు మార్మోగుతోంది. గురజాల నియోజవర్గంలో కేజీఎఫ్ రేంజ్ లో మైనింగ్ సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేసిన వైసీపీ…టీడీపీ హయాంలోనే అక్రమ మైనింగ్ సాగిందని ఎదురుదాడికి దిగుతోంది.
Read Also: Employees: ప్రభుత్వంలో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.. నేతల స్పందన ఇలా..
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గురజాల నియోజకవర్గంలోని అటవీ భూముల్లో అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, కూలీల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించడంతో దుమారం రేగింది. దీనికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఘాటుగానే జవాబు ఇస్తోంది. అసలు 2014 నుంచి 2019 వరకు గురజాల నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల దోపిడీ చేసింది టీడీపీ నాయకులేనని రివర్స్ అటాక్ చేస్తోంది. అక్రమ మైనింగ్ ఆరోపణలపై బహిరంగ చర్చకి సిద్ధమేనని కాసు మహేష్ రెడ్డి అంటుంటే, మాచవరం మండలం రేగుల గడ్డ అక్రమ తవ్వకాలపై నిగ్గుతేలుస్తామని టీడీపీ అంటోంది. రిజర్వ్ ఫారెస్ట్ లో కృష్ణానదిని పూడ్చి మరీ మైనింగ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తోంది. మొత్తానికి అక్రమ మైనింగ్ పై టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు పల్నాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!