అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శోభకృత్ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ సీనియర్ నేతలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పంచాగ పఠనం చేశారు పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు తప్పవన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బలపడుతుంది. జాతీయ రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు మరింత బలపడతారు. పార్టీ ఫిరాయింపులు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్ని పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారన్నారు పంచాంగకర్త పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ.
Read Also:Earthquake: మార్చి నెలలో 6 భూకంపాలు.. ఉత్తరాదిని వణికిస్తున్న ప్రకంపనలు..
ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది.పరిపాలనలో న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయి.ధరలు పెరుగుతాయి.ధరల పెరుగుదల మీద ప్రధాన ప్రతిపక్షం పోరాటాలు చేస్తాయి.లబ్దిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతాయి.ఆహార కొరత ఏర్పడే ప్రమాదం.విద్యా వైద్యా రంగాల్లో స్కాములు బయటపడతాయి.అభివృద్ది కంటే అనారోగ్యకరమైన పోటీ ఎక్కువగా ఉంది.కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతుంది.ఏడు తుపాన్ల ప్రమాదం.ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భూ కంపాలు వచ్చే సూచనలు.చంద్రుడు ఇంద్రుడవ్వాలి.తెలుగు రాష్ట్రాలకు శుభం జరగాలి.యువగళం నవగళం కావాలన్నారు పంచాంగకర్త.