Telugu Desam Party: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallamilli Moola Reddy Passes Away: తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) సోమవారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్లమిల్లి మూలారెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం రామవరంలోనే ఉంటున్న మూలారెడ్డి ఆది నుంచి టీడీపీ నేతగానే కొనసాగారు. 1970లో రామవరం సర్పంచ్ గా మూలారెడ్డి ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గం నుంచి ఏకంగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తి నుంచి పార్టీ అభ్యర్థిగా మూలారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
Read Also: NTR: వీలైతే నాలుగు మాటలు… కుదిరితే కప్పు కాఫీ!
Also Read
1983 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 1985, 1994, 1999 ఎన్నికల్లోనూ మూలారెడ్డి అనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసిన మూలారెడ్డి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మూలారెడ్డి బదులుగా ఆయన కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా మూలారెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..