Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ‘చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
Kiran Abbavaram: 2023లో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు
పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ మైల్ స్టోన్ చిత్రం అవుతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని నమ్మకంతో ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం’ అని మెగా సూర్య ప్రొడక్షన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విటర్ ద్వారా తెలియచేసింది.
Any work of quality cinema with historic significance that stands the test of time, demands meticulous detailing, research and immense effort of hundreds of cast and crew. pic.twitter.com/sdCHLSkLqp
— Mega Surya Production (@MegaSuryaProd) November 24, 2022