Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు..
- ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు..
- ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన రఘురామకృష్ణరాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghu Rama Krishna Raju: ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు మంగళవారం నాడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ, గురువారాల్లో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ పదవికి రఘురామకృష్ణరాజు ఎన్నిక లాంఛనమే అని చెప్పాలి. అయితే, మంగళవారం జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్ సమావేశంలో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ల నియామకంపై ప్రధానంగా చర్చ జరిపారు. దీంతో అసెంబ్లీ, మండలికి చీఫ్ విప్ల నియామకాలు, డిప్యూటీ స్పీకర్ పేరును కూడా సర్కార్ అందించింది. అసెంబ్లీలో 11 మంది టీడీపీ, ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీ నుంచి చీఫ్ విప్‌లను నియమించింది. మండలిలో ఇద్దరు టీడీపీ, ఒకరు జనసేన నుంచి విప్‌గా ఎంపికయ్యారు.
Read Also: Mystery Solved : వీడిన మడకశిర గుర్తు తెలియని శవం మిస్టరీ..!
Also Read
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
ఇక, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్డీయే కూటమి తరఫున నన్ను నామినేట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తో పాటు బీజేపీకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. కాగా, 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ సర్కార్ పై తిరుగుబాటు చేశారు. అప్పటి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా NDA కూటమి తరఫున నన్ను నామినేట్ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, @JaiTDP జాతీయ అధ్యక్షులు, శ్రీ @ncbn గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి, రాష్ట్ర మంత్రి, @JaiTDP జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ… pic.twitter.com/ReHkp7VvEn
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) November 13, 2024
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?