JC Prabhakar Reddy Threats: ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన నువ్వు ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు.. ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలని జేసీ నన్ను బెదిరించాడు.. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు.. సెటిల్ చేసుకో.. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని హెచ్చరించాడు.. గలీజు మాటలు, బండ బూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు అని సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
ఇక, గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి, ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు అని సూచించారు. నువ్వూ టీడీపీ నాయకుడివి.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వి.. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో.. అక్కడ మురుగు కంపుకొడుతోంది.. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది అని టీడీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.