వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత పట్టాభి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో కూడా పసుపు నాయకుడిగా తాను మాట్లాడుతున్నానని… తాను వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదన్నారు.
Read Also: విశాఖలో విషాదం.. చేపల వేటకు వెళ్ళి నలుగురి మృతి
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ఏ స్థాయిలో ఉన్న నేత తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా ఆధారాలతో సహా బయటపెట్టడమే తన పని అని టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచకాలను తట్టుకుని పోరాడుతున్న టీడీపీ శ్రేణులకు హ్యాట్సాఫ్ చెప్పాలిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యధిక పన్ను వసూలు చేస్తోందని ఏపీనేనని పట్టాభి ఆరోపించారు. ఈ విషయం తాను అనడం లేదని.. స్వయంగా కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రే చెప్పారని.. ఆయనకు సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై తమ ప్రభుత్వం ఎలాంటి పన్ను పెంచలేదని.. కేవలం రోడ్ల సెస్ కింద రూపాయి మాత్రమే తీసుకుంటున్నామంటూ సిగ్గులేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీలో రూ.28వేల కోట్ల రూపంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వసూలు చేశారని.. మళ్లీ దీనికి అదనంగా రోడ్ల సెస్ పేరుతో లీటరుకు రూపాయి వసూలు చేస్తున్నారని పట్టాభి విమర్శలు చేశారు. ఇప్పటివరకు తనపై వైసీపీ వాళ్లు మూడు సార్లు దాడులు చేశారని.. అయినా వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!