Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సూపర్ అవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 ను తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే.. అసలు సినిమాకు అనవసరమైన ఎలాంటి కథ, కథనాలు లేకుండా సినిమా మొదటి నుండి ముగింపు వరకు ‘మిషన్’ పైనే దృష్టి పెట్టినప్పటికీ తెరపై దాన్ని చూపించిన తీరు మాత్రం దారుణంగా నిరాశపరుస్తుంది. లాజిక్ కి దూరంగా ఉండే సీన్లు, మోతాదుకు మించిన యాక్షన్ ఈ సినిమా గ్రాఫ్‌ను దెబ్బతీశాయి.
సినిమాలో విపరీతమైన, నమ్మశక్యం కానీ యాక్షన్ దృశ్యాలు సీరియస్ సన్నివేశాల తీవ్రతను తగ్గించేశాయి. దీనివల్ల సినిమాలో వచ్చే కీలక ఘట్టాలు కూడా ప్రేక్షకులకు కామెడీగా, సిల్లీగా అనిపిస్తాయి. కార్తి పోషించిన సీనియర్ ‘సర్దార్’ పాత్ర ఆధారంగా వచ్చే ముఖ్యమైన బ్లాక్స్‌తో సహా, ఏ ఒక్క సీన్ కూడా అనుకున్న స్థాయిలో పండలేదు. ఇక ప్రతినాయకుడిగా నటించిన పి.ఏ.వి. ఎస్.జె. సూర్య తన నటనతో ఇంపాక్ట్ చూపించడం కంటే ఎక్కువ అరుపులు, గోలతో ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించారు. పాటలు, అనవసరమైన కమర్షియల్ వినోదాలు లేదా ఇతర దృష్టి మళ్లించే విషయాలు ఏవీ లేకుండా కథను నేరుగా చెప్పడానికి ప్రయత్నించడం మంచి విషయమే. అయినప్పటికీ ప్రేక్షకులకు ఇవ్వాల్సిన అసలైన థ్రిల్ మరియు ఇంపాక్ట్‌ను అందించడంలో దర్శకుడు తప్పటడుగులు వేసాడు. ఫస్టాఫ్ లో పండని డ్రామాను భరిస్తూ సాగిన ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ అయినా బలమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వస్తాయని ఆశించడం సహజం. కానీ ఆ కీలకమైన సెకండ్ హాఫ్ తేలిపోవడంతో ఈ ‘మిషన్’ అసలు గాల్లోకి ఎగరకముందే నేలకూలింది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!