Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tdp Leader Nimmakayala Chinarajappa On Vangaveeti Radha Krishna Issue

వంగవీటి రాధాపై రెక్కీ.. సీరియస్‌గా స్పందించిన టీడీపీ సీనియర్ నేత

Published Date :December 29, 2021 , 6:40 pm
By Sudhakar Ravula
వంగవీటి రాధాపై రెక్కీ.. సీరియస్‌గా స్పందించిన టీడీపీ సీనియర్ నేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

వంగవీటి రాధాపై రెక్కీ వార్తలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం రేపాయి.. ఆ విషయాన్ని రాధాయే స్వయంగా బయటపెట్టడం.. ఆ తర్వాత ప్రభుత్వం 2+2 సెక్యూరిటీ కల్పించడం.. ఆయన తిరస్కరించడం జరిగిపోయాయి.. మరోవైపు.. రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే.. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప సీరియస్‌గా స్పందించారు.. రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కీ నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రంగా హత్యకేసులో ప్రధాన ముద్దాయి దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్‌కు వైసీపీలో పెద్ద పీట వేశారు అని మండిపడ్డ ఆయన.. రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యం విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అని గుర్తుచేశారు.

Read Also: హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. వివరాలు ఇవే..!

ఇక, వంగవీటి రంగాను హత మార్చడంలో తప్పులేదన్న గౌతంరెడ్డికి సీఎం వైఎస్‌ జగన్.. ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ ఇచ్చారని మండిపడ్డారు నిమ్మకాలయ చినరాజప్ప.. రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదని వంగవీటి రాధా గతంలోనే బహిరంగ ప్రకటన చేశారని గుర్తుచేసిన ఆయన.. రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తామన్న వైసీపీ నేతలు.. అరవ సత్యం, అవినాష్‌లను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు..? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇంకా రంగా హత్యను టీడీపీకి ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన.. నాడు రంగా హత్యను వైఎస్సార్ రాజకీయంగా వాడుకుంటే.. రాధాను హత్య చేసి.. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇప్పటికైనా జగన్ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు చినరాజప్ప.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • nimmakayala chinarajappa
  • tdp
  • Vangaveeti Radha Krishna
  • Vangaveeti Radha Krishna Issue

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions