ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అన్నారు సీనియర్ టీడీపీ నేత నేత ధూళిపాళ్ల నరేంద్ర. వైసీపీ ప్రభుత్వానికి విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ,అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమ విజయాలు సాధించిన వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అన్నారు. పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చి దొంగ ఓట్లు వేసినా, టిడిపి కార్యకర్తలు నాయకులు ప్రాణాలు ఒడ్డి విజయం సాధించారని నరేంద్ర కొనియాడారు.
Read Also: Congress : నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. టీఎస్పీఎస్సీలో అసలు దొంగలెక్కడ?: పొన్నం
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను బెదిరించి గెలుపులు సాధించడం కూడా ఒక విజయమేనా? రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా ఇదే తరహా తీర్పు ఇస్తారు… వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వరన్నారు ధూళిపాళ్ళ నరేంద్ర. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమలోనూ విజయం దోబూచులాడుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఈవిధంగా బయటపడిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి కౌంట్ డౌన్ లాంటివని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Read Also:Bhanu Sree: బన్నీ బ్లాక్ చేశాడు అనే ట్వీట్, ఛానెల్ ప్రమోషన్ కోసమేనా?