Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tdp 40 Years Journey And What Is The Chandrababu Strategy In Future

TDP@40: టీడీపీకి పూర్వ వైభవం వచ్చేనా? చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా?

Published Date :March 29, 2022 , 6:13 pm
By Ramesh Nalam
TDP@40: టీడీపీకి పూర్వ వైభవం వచ్చేనా? చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ఐదేళ్ల పాటు.. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎం పీఠం అధిరోహించారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది నేతల్లో సగానికి సగం పైగా టీడీపీ ఆనవాళ్లు ఉన్నవాళ్లే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ నేతగా పనిచేశారు. చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకున్నారు. అయితే గత 40 ఏళ్లలో టీడీపీ ప్రస్థానం అనేక ఆటుపోట్లకు గురైంది. ముఖ్యంగా తెలంగాణ విభజన తర్వాత టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యింది. ఏపీలోనూ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలోనే ఉంది. 2019 ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయనే చెప్పవచ్చు.

అయితే 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించే పనిలో చంద్రబాబు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన పార్టీ అధికారంలోకి రావాలంటే ప్లానింగ్ మాములుగా ఉండకూడదు. కానీ ప్రస్తుతం టీడీపీలో సీనియర్లు అంతంతమాత్రంగానే పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబుకు పలువురు సూచిస్తున్నారు.

కింజారపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్, వంగవీటి రాధా లాంటి యువనేతలు టీడీపీకి అవసరమని.. వాళ్లు వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలతో సీఎం జగన్ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ప్రతిపక్షం టీడీపీ మరింత దూకుడుగా వ్యవహరించాలని పలువురు హితవు పలుకుతున్నారు. ఏదేమైనా చంద్రబాబును మళ్లీ సీఎం హోదాలో చూడాలని తెలుగు తమ్ముళ్లు తెగ ఆరాటపడుతున్నారు.

https://ntvtelugu.com/tdp-mp-galla-jayadev-demands-give-bharat-ratna-award-to-ntr/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Analysis
  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • political news
  • tdp 40 years

తాజావార్తలు

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions