భారీవర్షాలు, గోదావరి వరద కారణంగా అటుతెలంగాణ, ఇటు ఏపీలోని పోలవరం, గోదావరి ముంపు ప్రాంతాల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 46 ముంపు మండలాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు అందిస్తుందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా కలెక్టర్ మాధవి లతలతో కలిసి గురువారం సీతానగరం మండలం లోని ముంపు గ్రామాలను పరిశీలించారు.
LIVE: భద్రాద్రికి రాకపోకలు బంద్.. ఆ ఒక్క దారీ మూసివేత
ముంపు ప్రాంతాల్లోని సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి వనిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిక్షణం పరిశీలిస్తున్నారని, బాధితులకు శిబిరాలను ఏర్పాటు చేసి, అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా శిబిరాల్లో ఉంటున్న వారికి, వరదలు తగ్గిన తర్వాత ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించే విధంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. పోలవరానికి భారీగా పెరిగిన వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 34.840, స్పిల్ వే దిగువన 26.620 మీటర్లు నమోదైన నీటిమట్టం. 48 గేట్ల ద్వారా 16,16,830 కూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ,కటుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారికి ఆహారం పంపడానికి హెలికాఫ్టర్ పంపింది విపత్తుల సంస్థ.గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు.
ఇటు భద్రాచలంలోని ప్రాంతాలు ముంపుతో మునిగిపోతున్నాయి. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి వరద వస్తుందని చెప్తున్నారు తాము ఇంత పెద్ద స్థాయి వరద వస్తుందని అనుకోలేదని కానీ ఇప్పుడు వస్తున్న వరదతో తమ ఇండ్లన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం పట్టణంలో ముంపు ప్రాంతాల్లో తమ సామాన్ల కోసం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భద్రాచలంకి వెళ్ళే దారులన్నీ మూసేశారు. ప్రధాన రహదారి, బ్రిడ్జిని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నాం. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరిని పంపించము. రాత్రికి సుమారుగా 70 అడుగుల వరకు వరద ఉధృతి పెరుగుతుంది అని అంచనా వేశాం అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASP రోహిత్. ఎట్టి పరిస్థితులలో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దు. బయటికి రావొద్దు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో పర్య వేక్షిస్తున్నాము. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావొద్దన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASP రోహిత్.
Singer Daler Mehndi: ప్రముఖ సింగర్ కు రెండేళ్లు జైలు శిక్ష