Tagore Scene: ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నమ్మించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tagore Hospital Scene Repeat In Anantapur Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలో ఆసుపత్రిలో సీన్ గుర్తుందా? అదే చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని నమ్మించి, కొన్ని గంటల పాటు చికిత్స చేసి, చివరికి చనిపోయాడని ఆసుపత్రి వర్గాలు నాటకమాడుతాయి కదా! సరిగ్గా అలాంటి సన్నివేశమే అనంతపురంలో చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నాలుగు గంటల పాటు ఓ ఆసుపత్రి సిబ్బంది నాటకం ఆడింది. తీరా పోలీసులు సీన్‌లోకి వచ్చాక.. అసలు గుట్టు బట్టబయలు అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Riti Saha : విశాఖలో సంచలనం రేపుతున్న వెస్ట్ బెంగాల్ విద్యార్థిని అనుమానస్పద మృతి కేసు
Also Read
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- OTR: సొంత జిల్లాలో రామ్మోహన్‌కు అసంతృప్తి సెగ?
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్‌బీ (32)కి అనంతపురం జిల్లాలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరుస్వామితో ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే.. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, పిల్లలు కలగలేదు. దీంతో.. పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆసుపత్రి గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మబలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్‌బీని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు.
Crime News: పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. పిల్లలు కలగడం లేదని..
లోపలికి తీసుకెళ్లి ఆమెకు మందు ఇవ్వగా.. నిమిషాల వ్యవధిలోనే అది వికటించి మృతి చెందింది. ఈ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు నానా రాద్ధాంతం చేస్తారని భయపడి.. గంటపాటు అలానే ఉంచారు. ఆ తర్వాత లోపలికి పిలిచి.. మోదీన్‌బీకి మూర్ఛ వచ్చిందని, పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, వెంటనే బెంగళూరుకు తీసుకొని వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పింది. ఆమె బ్రతికే ఉందని నమ్మించేందుకు.. ఆక్సిజన్‌ను కృత్రిమంగా పంపింగ్ చేస్తూ నాటకం ఆడాడు. ఇలా 4 గంటల పాటు ఆ మహిళ మృతి చెందిన విషయం చెప్పకుండా ఆపరేషన్ థియేటర్‌లోనే నాటకం ఆడారు.
Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?
ఇక పరిస్థితి చెయ్యి దాటిపోయిందనుకున్న ఆసుపత్రి సిబ్బంది.. రాత్రి 7:45 గంటలకు సేఫ్టీ కోసం పోలీసుల్ని పిలిపించి, మోదీన్‌బీ చనిపోయినట్లుగా కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతురాలు గుత్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో.. బంధువులు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రిలోని ఐసీయూ గదిని ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగులకొట్టారు. వైద్యులు, పోలీసులపై కూడా ఎటాక్ చేశారు. చివరికి సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపు చేశారు. బంధువు మాత్రం.. ఆసుపత్రిని సీజ్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!