పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్ లను పూర్తి చేసుకొని 7 వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రసారం కానున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది… వరుసగా ఏడో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది..అయితే తాజాగా కొందరి కంటెస్టెంట్ పేర్లు కూడా లీక్ అయ్యాయి.సడన్ గా ఈ లిస్ట్ లో హీరోయిన్ ఫర్జానా పేరు కూడా వినిపిస్తుంది. చివరి నిమిషంలో ఫర్జానాను మేకర్స్ ఎంపిక చేశారని సమాచారం.ఫర్జానా ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఫర్జానా 2006లో వచ్చిన భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది..ఆ తరువాత అల్లరి నరేష్ సరసన సీమశాస్త్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది..ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఆ తరువాత ఈ భామ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, కుబేరులు వంటి సినిమాలు చేసి మెప్పించింది.
ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న ఫర్జానా సడన్ గా చిత్ర పరిశ్రమకు దూరమైంది.. మళ్ళీ ఇన్నేళ్లకు మీడియాలో ఆమె పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్ షో లో ఈ భామ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అలాగే తాజాగా లీక్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ లో స్టార్ హీరో అబ్బాస్ పేరు కూడా వినిపిస్తోంది. ఫారెన్ లో సెటిల్ అయిన అబ్బాస్ ఇటీవల ఇండియా వచ్చారు. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నారు.. ప్రేమదేశం మూవీతో బాగా ఫేమస్ అయిన అబ్బాస్ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సడన్ గా ఈ హీరో సినిమాలకు దూరం అయ్యాడు. తాజాగా ఆయన కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి ఎంపికయ్యాడంటూ బాగా ప్రచారం జరుగుతుంది.అయితే ఇంకా కొందరు ప్రముఖ నటి నటులు బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.అయితే తాజాగా వస్తున్న ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఈ షో గ్రాండ్ లాంచ్ డే వరకు ఎదురు చూడాల్సిందే.