దేశంలో 21 రాష్ట్రాలకు చెందిన బోర్డులు పరీక్షలను రద్దు చేయగా, ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయకుండా నిర్వస్తామని అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దేశంలోని అనేక బోర్డులు పరీక్షలను రద్దు చేశాయని, ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే… ఏ ఒక్క విద్యార్ధి మరణించినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారి విస్తరణ వేళ పరీక్షలకు హాజరయ్యో లక్షలాదిమంది విద్యార్ధులను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించింది.
Read: హాలీవుడ్ కు విద్యుత్ జమ్వాల్
5.2 లక్షల మంది విద్యార్దుల కోసం 34 వేల రూములు ఏర్పాటు చేస్తామని, ఒక్కోరూములో 18 మంది చోప్పున కూర్చోబెడటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే, అఫిడవిట్లో వేలకొద్ది గదులను అందుబాటులోకి తీసుకొచ్చి ఎలా సమన్వయం చేస్తారో పేర్కొనలేదని, వేలకొద్ది గదులను ఏర్పాటు చేయడానికి 15 రోజుల సమయం ఎలా సరిపోతుందని కూడా కోర్టు ప్రశ్నించింది. పరీక్షలు నిర్వహించే సమయంలో థర్డ్ వేవ్ వస్తే ఏంచేస్తారని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వలేమని, గురువారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.