మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి వేసిన నామినేషన్లో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని అతను కోర్టు కోరారు. ఇక దీనిపై శనివారం విచారణ చేపట్టగా.. ఆఫిడవిట్‌లోని అభ్యంతరాలపై ఫిర్యాదు దారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్టు ఎన్నికల కమిషన్ తరపు…
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీ సహా ఎన్‌సీఆర్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్‌లను కోర్టు కోరింది.
2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్‌ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో అపూర్వమైన శాంతి నెలకొందని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అంతేకాకుండా నిపుణుల కమిటీ మరియు పిటిషనర్ల సిఫార్సులను రికార్డులో ఉంచింది. సెబీ కూడా సుప్రీంకోర్టు నుంచి 'తగిన ఉత్తర్వుల' కోసం చూస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి,…
ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు…
దేశంలో 21 రాష్ట్రాలకు చెందిన బోర్డులు పరీక్షలను రద్దు చేయగా, ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయకుండా నిర్వస్తామని అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దేశంలోని అనేక బోర్డులు పరీక్షలను రద్దు చేశాయని, ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే… ఏ ఒక్క విద్యార్ధి మరణించినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారి విస్తరణ వేళ పరీక్షలకు హాజరయ్యో లక్షలాదిమంది విద్యార్ధులను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించింది.…