ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
చంద్రబాబు సహాయంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. అత్యాధునిక వసతులతో ఏపీ జైలు పథకం ప్రవేశపెట్టాలని.. అది టీడీపీకి, వైసీపీకి మంచిదని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ అర్ధాంతరంగా ఆపేశారని.. ఎందుకు ఆపేశారంటే మాత్రం సమాధానం లేదన్నారు. పైగా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ ముగ్గురి గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. రాజా హర్శింగ్ సమయంలోనే శ్రీనగర్‌కు పాక్ దళాలు వచ్చాయని. అప్పటికి అది సంస్థానం అని.. రాజా హర్శింగ్ నెహ్రూ సహాయం కోరారని తెలిపారు. యూఎన్ ఆదేశం మేరకే ఎల్వోసీ ఏర్పాటైందన్నారు 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారని? ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ తుస్సు యుద్ధం అన్నారు. విదేశాంగ శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతిస్తే.. ఇప్పుడేమో సుంకాల పేరుతో బాదేస్తున్నారని కేంద్రంపై కిల్లి కృపారాణి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: 7న విపక్షాలకు రాహుల్‌గాంధీ ప్రత్యేక విందు.. స్పెషల్ ఇదే!
