Site icon NTV Telugu

Duvvada Srinivas: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది.. ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన ఆరోపణలు..

Duvvada

Duvvada

Duvvada Srinivas: వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణ దాస్- ధర్మాన ప్రసాదరావులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై నిలబడి వీడియోను దువ్వాడ విడుదల చేశారు. సోషల్ మీడియా వ్యాఖ్యల తర్వాత తనపై దాడికి కుట్ర చేశారని తెలిపారు. కింజరాపు, ధర్మాన ఫ్యామిలీల మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నంటూ ఆరోపించారు. నిమ్మారకి చెందిన కింజరాపు అప్పన్న చెప్పొదంటూ ఆడియో విడుదల చేశారు. ఈ రోజో రేపో దాడి జరిగే అవకాశం ఉందంటూ బెదిరిస్తే భయపడేది లేదని శ్రీనివాస్ అన్నారు.

Read Also: Rajanna Sircilla: వేములవాడ రాజన్న భీమేశ్వర ఆలయంలో.. బ్రేక్ దర్శనాలు చేపిస్తామని భక్తుల వద్ద డబ్బులు వసూల్..

అయితే, కింజరాపు అప్పన్న మాటల రికార్డింగ్ మీడియాకు దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక, వైరల్ ఆడియోతో జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. నాకు ఏం జరిగినా ధర్మాన సోదరులే బాధ్యత అని దువ్వాడ అన్నారు. ఇక, జిల్లాలో కాలింగా వర్సెస్ వెలమ వేడి మధ్య కొత్త రాజకీయం హీటెక్కుతుంది.

Exit mobile version