నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఏంజరుగుతోందన్న టెన్షన్ అందిరలోనూ మొదలైంది. ఇవాళ ఓవైపు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసి పిలుపునిచ్చారు. దీంతో.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ పలాస పర్యటన ఖరారు చేశారు. నారాలోకేష్ జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు వివాహానికి వస్తున్ననేపథ్యంలో.. పలాస కూడా వెళ్లి అక్కడి కౌన్సిలర్ సూర్య నారాయణకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో.. పోలీసులు ముందస్తుగానే ఆ పట్టణానికి చేరుకున్నారు.
అయితే.. వాణిజ్య కేంద్రమైన జంట పట్టణంలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూదందాపై గత వారం రోజులుగా అధికార, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇంఛార్జీ గౌతు శిరీష మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇది వరకే ప్రకటించడంతో.. ఇంతలో శ్రీనివాస నగర్ కాలనీ వివాదం తెరపైకి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా.. ఓవైపు మంత్రి అప్పలరాజు ఆ వార్డులోని కౌన్సిలర్ సూర్య నారాయణ ఇళ్లను తొలగిస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఆయనకు అండగా టీడీపీ అధిష్టానం సైతం నిలవడంతో అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం 19న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిరీషను లక్ష్మీపురం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డు కుని వెనక్కి పంపించిన విషయం విదితమే. ఇక మంత్రి అప్పలరాజుపై కూడా టీడీపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పవర్ ఏమిటో చూపి స్తామన్న ధోరణిలో వైసీపీ శ్రేణులు ముందుకు పోతున్నారు. దీంతో ఇవాల్టిరోజూ ఎలా గడుస్తుందోనని జంట పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.
Amit Shah : అమిత్ షా పర్యటన షెడ్యూల్ మినిట్ టు మినిట్