Minister Satya Kumar Dance: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు రెండో రోజున మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సంప్రదాయ వాతావరణంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలోని పాటకు మంత్రి ఉత్సాహంగా అడుగులు వేయడంతో అక్కడి ప్రేక్షకులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. స్టేజ్‌పైన ఉన్న డ్యాన్సర్లు స్టెప్పులు చూపించడం.. వాటిని మంత్రి ఫాలో అవుతూ.. కాలు కదపడంతో అంతా హుషారు వాతావరణం ఏర్పడింది.. మంత్రి డ్యాన్స్‌కు స్పందనగా వేడుకల ప్రాంగణం మొత్తం పండుగ సంబరాలతో మార్మోగింది. ప్రజలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడం విశేషంగా కనిపించింది. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో పాటు, సంక్రాంతి పండుగ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది.
Read Also: Jammu Kashmir: “దాయాది వక్రబుద్ధి”.. భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్స్! ఆ ఏరియాల్లో హై అలర్ట్