CM Chandrababu: నేడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారి పల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు పెద్దన్నవారిపల్లికి సీఎం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 01.05 నుంచి 1.30 గంటల వరకూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు.
Read Also: POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష
అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 వరకు ప్రజా వేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. తరువాత మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ స్థానిక టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగే సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ భేటీలో పార్టీ శ్రేణులకు సీఎం కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు.