Hindupur: హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో శుక్రవారం బిజీబిజీగా గడిపారు.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మరోవైపు.. హిందూపురం మున్సిపాల్టీని కైవసం చేసుకోవడానికి బాలయ్య చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. దీంతో.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్‌చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..
Read Also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..
మరోవైపు.. ఈ నెల 20న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం కానుంది.. ఈ సమావేశంలో చైర్‌పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదం కోసం మిగిలిన సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు మున్సిపల్ అధికారులు.. ఇదే సమయంలో.. హిందూపురం మున్సిపల్ కొత్త చైర్మన్‌గా.. కౌన్సిలర్ డీఈ రమేష్‌కు అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, తెలుగుదేశం పార్టీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లపై వేటు వేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా విజయం సాధించి టీడీపీలో చేరిన కౌన్సిలర్లపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. పార్టీ ఫిరాయించిన 11 మంది వైసీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కాగా, హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఇంద్రజ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలు మున్సిపాల్టీలను టీడీపీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకున్న విషయం విదితమే.
