YS Jagan: నెల్లూరు జిల్లాపై వైసీపీ హైకమాండ్ ఫోకస్.. పార్టీకి పూర్వ వైభవం..!
- నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవంపై హైకమాండ్ ఫోకస్..
- వర్గపోరు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా అడుగులు..
- 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా పలువురు నేతలు..
- కూటమి ప్రభుత్వంపై వైసీపీ సమరభేరీ ..
- పలు సమస్యలపై నిరసనలకు పిలుపు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవంపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అధికార పక్షాన్ని ఢీకొట్టే బలమైన నేతలను సిద్ధం చేయడంపై దృష్టిసారించింది. అదే సమయంలో పార్టీలో వర్గపోరు, ఆధిపత్య పోరు కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 2014..2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాలో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. పలువురు నేతలు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సొంత వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. దీంతో నియోజకవర్గస్థాయి నేతల మధ్య సమన్వయం కొరవడింది.
Read Also: Priya Prakash Varrier : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ..?
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. వైసీపీ అధిష్టానం నిరసన కార్యక్రమాలను పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమాల్లో జిల్లా నేతలు మొక్కుబడిగా పాల్గొనడం అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. లీడర్ల మధ్య సమన్వయం లోపంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంలేదని సమాచారం. విద్యుత్ ఛార్జీలతో పాటు పలు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చినా.. క్యాడర్‌లో ఆశించిన స్థాయిలో స్పందన కరువైందన్న చర్చసాగింది. నియోజకవర్గస్థాయిలో పార్టీ పరిస్థితులపై నివేదిక సేకరించిన జగన్.. స్వయంగా నేతలతో మాట్లాడేందుకు తాడేపల్లిలో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించారు. పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని.. హామీ ఇచ్చారు. తాను కూడా స్వయంగా జిల్లాకు వచ్చి నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతానని ప్రకటించారు. నేతల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నా.. వాటిని మర్చిపోయి సమన్వయంతో పని చేయాలన్నారు. మొత్తంగా అధినేత జగన్ సమావేశం తర్వాత జిల్లా వైసిపి శ్రేణుల్లో ఎలాంటి మార్పు వస్తుందో వేచిచూడాలి.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!