Minister Narayana: ఖజానా ఖాళీ.. అన్ని శాఖల్లో అప్పులే..!
- గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది..
- అప్పులు చేసి పెట్టింది..
- ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి..
- మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టింది.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిందని విమర్శించారు.. అయితే, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలి.. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నిటినీ వాడేశారనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మురిగిపోయాయని విమర్శించారు..
Read Also: Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
మరోవైపు.. ఈ రోజు తెల్లవారుజామున నుండే రాష్ట్రంలో 68 లక్షల 64 వేల మందికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని వెల్లడించారు మంత్రి నారాయణ.. రూ.3వేల నుండి రూ..4 వేలకు పెంచుతామని ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు.. ఇచ్చిన మాటకు అనుగుణంగా.. గత నెలలో ఒకేసారి రూ.7 వేల పెన్షన్ పంపిణీ చేశాం.. ఈ నెల నుంచి ప్రతీ నెలా రూ.4 వేల పెన్షన్ లబ్ధిదారులకు అందుతుందన్నారు.. ఇక, ఈ నెలాఖరుకు 203 అన్నా క్యాంటీన్లను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి పొంగూరు నారాయణ.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..