తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. కానీ అదే టైమ్ లో ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్2 నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది.
Also Read : Power Star : పుష్ప 2.. డే -1 కలెక్షన్స్ ను హరిహర బీట్ చేస్తాడా.?
నార్త్ లో ఊహించని రేంజ్ లో వార్ 2 విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్. అలాగే సౌత్ లో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లానింగ్ రెడీ చేస్తోంది. దాంతో కూలీకి అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అయితే కూలీకి నార్త్ లో కాస్త మంచి సపోర్ట్ దొరికింది. బాలీవుడ్ లో బడా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన పెన్ స్టూడియోస్ అయిన పెన్ మధుకర్ కు కూలీ నార్త్ రైట్స్ అప్పగించారు. ఇప్పటివారకు తమ సినిమాకు నార్త్ లో ఎదురులేదు అనుకున్న యష్ రాజ్ ఫిల్మ్స్ కు పెన్ స్టూడియో రూపంలో పోటీ ఎదురైంది. ఇది కొంతవరకు వార్ 2 మేకర్స్ కు షాక్ అనే చెప్పాలి. అయితే వార్ 2 విషయంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లానింగ్ భారీగా ఉంది. ఇండియా వైడ్ గా ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ ను వార్ 2కోసం లాక్ చేసేసింది. తెలుగు, తమిళ్, కన్నడలోను వార్ 2 రిలీజ్ భారీ ఎత్తున ఉండబోతుంది.